Header Banner

జగన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తి, విచారం! ఈ వ్యాఖ్యలను ఉపేక్షించే పరిస్థితే లేదు..

  Sun Jun 08, 2025 16:27        Politics

రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ ఛానల్‌ లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని గురించి, అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా 'వేశ్యలు' అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ, మీడియా ముసుగులో సాగుతున్న ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. "తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం.

 

ఇది కూడా చదవండి: మోదీ, చంద్రబాబు వద్ద చదువుకుని.. రాహుల్ వద్ద ఉద్యోగం చేస్తున్నా! హాజరైన తెలంగాణ సీఎం

 

ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం.రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Amaravati #Appeoples #WomenAgainstComments #jagan #FireOnJagan #derogatory #ViralNews